సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎంత పాజిటివ్ గా ఉంటుందో అంతే నెగిటివ్ గా కూడా ఉంటుంది . ఎంత పెద్ద హీరో అయిన స్టార్ అయిన తర్వాత కచ్చితంగా జీరో అవ్వాల్సిందే . చరిత్ర అలానే చెప్తుంది . ఎంతోమంది స్టార్స్ అలా ముందు ఇండస్ట్రీలో రాజ్యమేలేసి ఆ తర్వాత ఫ్లాప్ అయిపోయి సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో "తండేఅల్" సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .  టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తాజా చిత్రమే ఈ మూవీ .

సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా సినిమాకి పాజిటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది . హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా మారింది. అసలు సాయి పల్లవి డాన్స్ చేస్తుందా ..?నెమలి డాన్స్ చేస్తుందా..? అన్న రేంజ్ లో సాయి పల్లవి అదరగొట్టేసింది . బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ వావ్ అనిపించింది . కాగా ఇప్పుడు ఈ సినిమా నాగచైతన్య ఖాతాలో బిగ్ హిట్గా మారిపోయింది .

అయితే నిజానికి ఈ హిట్ వేరొక హీరో ఖాతాలో పడాల్సింది. ముందుగా డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాను నేచురల్ స్టార్ నానికి వివరించారట . అయితే నాని "దసరా" సినిమాలో డి గ్లామరస్ లుక్ లో కనిపించాను.. మళ్ళీ ఇది కూడా అలానే చేస్తే  జనాలకి బోర్ కొట్టేస్తుందేమో అంటూ భయపడి సినిమా రిజెక్ట్ చేశారట . ఆ తరువాత ఈ స్టోరీ చాలా మంది హీరోల వద్దకు వెళ్ళింది. కానీ రిజెక్ట్ చేశారు. ఫైనల్లీ..ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాగా కాన్సెప్ట్ అంతా కూడా జనాలను ఆకట్టుకుంది . నాని తప్పు చేశాడు ఒప్పుకొని ఉంటే మరొక బిగ్ హిట్ తన ఖాతాలో పడి ఉండేది అంటున్నారు అభిమానులు . అలా ఈ సినిమాను వదులుకొని నాని తప్పు చేశాడు అంటున్నారు . చూద్దాం మరి నాగచైతన్యసినిమా హిట్ తో ఎన్ని అవకాశాలు తన ఖాతాలో పడేలా చేసుకుంటాడో..?????

మరింత సమాచారం తెలుసుకోండి: