టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో సాయి పల్లవి కూడా ఒకరు.. ఇమెను ఎక్కువగా అభిమానులు న్యాచురల్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. సాయి పల్లవి 1992లో తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది.. ఈమె తల్లి కూడా డాన్స్ టీచర్ కావడంతో చిన్న వయసు నుంచే ఆమెను చూసి డ్యాన్స్ మీద ఆసక్తి పెంచుకున్నదట. స్కూల్లో చదువుకునే సమయాలలోనే డాన్స్ ప్రదర్శన చేస్తూ ఉండేదట. బాల నటిగా తమిళంలో రెండు చిత్రాలలో కూడా నటించిందట సాయి పల్లవి.


అలాగే ఈటీవీలో డాన్స్ షో నాలుగో సీజన్లు కంటిస్టెంట్ గా గ్రేస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. చదువుకునే రోజులలో హీరోయిన్గా చేయమని కొంతమంది డైరెక్టర్లు అడగగా.. సాయిపల్లవి ఇంట్లో హీరోయిన్గా ఒప్పుకోలేదట. ఇక్కడే ఉంటే సినిమాలని మారం చేస్తారని జార్జియా వెళ్లి ఎంబిబిఎస్ చేయమని తల్లితండ్రులు అక్కడికి పంపించారట. ఆ తర్వాత సినిమాలలోకి వచ్చిందట. సినిమాలు థియేటర్లో చూడడం అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమట.. అందుకే చాలా సందర్భాలలో బుర్కా ముఖానికి స్కార్పు కట్టుకొని మరి సినిమాలను చూడడానికి వెళుతూ ఉండేది.


పారానిక చిత్రాలలో నటించాలనేది ఈమె చిరకాల కోరికట అందుకే బాలీవుడ్ లో రామాయణ అనే సినిమాలో అవకాశం రావడంతో ఓకే చెప్పిందట. ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు ముఖం పైన మొటిమలతో మేకప్ లేకుండా ఉన్న తనను ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుకున్నదట. కొంతమంది దర్శకులు మేకప్ వేసుకోమని సలహా ఇచ్చిన ఆ తర్వాత చూసి నువ్వు నీలా లేవు సహజంగా లేవంటూ మేకప్ ని తీసేయమనేవారట. పూలతో రంగులు వేయడం సీతాకోకచిలుకలతో ఆడుకోవడం అంటే ఈమెకు చాలా ఇష్టమట. సాయి పల్లవి తెలుగు ,ఇంగ్లీష్, కన్నడ, హిందీ, జార్జియస్ భాషలలో మాట్లాడగలదట. ట్రిప్పు ప్లాన్ చేయాలి అంటే గోవా ,దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళుతుందట. ఈమె ధరించిన జపమాల తన తాత ఇచ్చిందట. పెప్పర్ చికెన్, చాక్లెట్లు, స్వీట్లు అంటే చాలా ఇష్టమట. హీరో సూర్యతో ఒక్కసారైనా నటించాలనేది ఆమె చిన్ననాటి క్రష్.NGK సినిమాతో ఆమె కోరిక నెరవేరింది. ఫిట్నెస్ కోసం రెండు మూడు రోజులు బ్యాట్మింటన్ ఆడుతుందట. కాలి సమయాలలో డాన్స్ నేర్చుకుంటూ ఉంటుందట. హర్రర్ చిత్రాలు చూడడమంటే తనకి చాలా భయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: