మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణించాడు. తన సినిమాల ద్వారా యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ తన తదుపరి సినిమాతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వక్సేన్ నుంచి తాజాగా రాబోతున్న చిత్రం "లైలా". ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 


లైలా సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానుండడం విశేషం. ఇప్పటికే విశ్వక్సేన్ తో పాటు లైలా సినిమా నిర్మాత చిరంజీవిని స్వయంగా కలిసి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. అక్కడ చిరంజీవిని కలిసి పూలదండ, శాలువాతో చిరు సత్కారాన్ని చేశారు.

కాగా, చిరంజీవితో కలిసి విశ్వక్సేన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక లైలా సినిమాలో విశ్వక్సేన్ మొదటిసారిగా లేడీ గెటప్ లో కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, రీసెంట్ గా విశ్వక్సేన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఓ రిపోర్టర్ విశ్వక్సేన్ ని సినిమా ఈవెంట్లకు నందమూరి హీరోలను పిలిచే మీరు ఈసారి మెగాస్టార్ చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచారు ఏంటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ.... మెగాస్టార్ చిరంజీవికి, మా నాన్నకు PRP పార్టీ నుంచి మంచి స్నేహం ఉందని వెల్లడించాడు. మలక్పేట్ నుంచి ఎమ్మెల్యేగా తన నాన్న పోటీ చేశారని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. ఆ స్నేహం కారణంగానే ఈసారి మెగాస్టార్ చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించామని విశ్వక్సేన్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: