తమిళ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ సినిమాలలో నటించారు. విజయ్ నటించిన తాజా చిత్రం విదాముయార్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. కన్నడ హీరో అర్జున్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో త్రిష తో పాటు రెజీనా కీలక పాత్రను పోషించింది. 


ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని సమకూర్చారు. కాగా, ఈ సినిమా తెలుగులో పట్టుదల పేరుతో తీసుకురావడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల అనంతరం సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులోను రిలీజ్ చేశారు.


కాగా, గత సంవత్సరం అజిత్ నుంచి వచ్చిన తునివు (తెగింపు) సినిమాకు వచ్చిన వసూళ్లను విధముయార్చి సినిమా అధిగమించలేకపోయింది. తునివు సినిమా మొదటి రోజు రూ. 24.4 కోట్ల కలెక్షన్లను సాధించగా... విదాముయార్చి సినిమా కేవలం రూ. 22 కోట్ల కలెక్షన్లను మాత్రమే సాధించింది. అయితే వీకెండ్స్ లోను ఈ సినిమా కలెక్షన్లను ఎక్కువగా తెస్తుందేమోనని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు.

సినిమా థియేటర్లలో ఉదయం 58.81%, మధ్యాహ్నం 60.27%, సాయంత్రం 54.70% గా నమోదు కావడం విశేషం. తిరుచ్చి, పాండిచ్చేరి లలో 92 శాతం, 91.6% ఆక్యుపెన్సి నమోదు కాగా, చెన్నైలో 88.33% ఆక్యుపెన్సితో థియేటర్లలో నడవడం గమనార్హం. మరి ఈ సినిమా వీకెండ్స్ లోనైనా కలెక్షన్లను ఎక్కువగా సాధిస్తుందేమోనని భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: