తెలుగు అమ్మాయిగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నట్టు వంటి హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. సీనియర్ హీరో రాజేష్ కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాలలోనే నటిస్తూ ఉండేది. కోలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా కూడా ఈమె సరైన సక్సెస్ అందుకోలేదు. కేవలం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండేటువంటి ఐశ్వర్య రాజేష్ అనుకున్నంత విధంగా అవకాశాలు రాకపోవడంతో వచ్చిన అవకాశాలను చేస్తూ ఉన్నది.అలా ఇప్పటివరకు 50 సినిమాలలో పైగా నటించింది ఐశ్వర్య రాజేష్.


మొదట కౌశల్య కృష్ణమూర్తి అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇటివలే వెంకటేష్ తో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టి హిట్టుగా నిలిచింది. ఇందులో భాగ్యం పాత్రలో అందరినీ అలరించిన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటోంది.


ఇక మీదట కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తాందట.కథ నచ్చడంతో పాటుగా తన పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని అప్పుడే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. వీటితో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ కోటి రూపాయలు కాగా ఆ తర్వాత ఈ మరి రేమ్యూనరేషన్ ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈమే ఆనకున్నట్టుగానే నిర్మాతలు ఇంతటి రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలలో నటింపజేసేలా చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: