ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. 'సినిమాను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ కొట్టడంతో సోషల్ మీడియాలో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. నేను మిస్ అయింది మళ్లీ తెరిగి వచ్చింది. నేను ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలం అయ్యింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి మరి.