టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల మొదలైంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకోసం బాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికోసం ఆ ప్రధాన పాత్ర పోషించేందుకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను కలిసి మాట్లాడినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారని టాక్ వినిపించింది. ఇక ఆ వార్తపై పృథ్వీరాజ్ రియాక్ట్ అయ్యారు. ఇంకా ఆ సినిమాలో తన పాత్రపై స్పష్టత రాలేదని తెలిపారు. ఇప్పుడు వాటి గురించి చర్చలు జరుగుతున్నాయని.. అన్నీ ఫైనల్ అయ్యాకనే దాని గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు.
ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో  నుంచి ఇంతవరకు ఎలాంటి సీన్ కూడా లీక్ కాలేదు. కనీసం సినిమా సెట్ ఇమేజ్ కూడా బయటికి రాలేదు. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సినిమా షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకపోవడంతో ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.  ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని కూడా మహేష్ బాబు బ్రేక్ చేశాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: