టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మదన హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్ , జగపతి బాబు , రావు రమేష్ , సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు.

పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా ఎన్నో కొత్త కొత్త రికార్డులను కూడా సృష్టించింది. ఇకపోతే ఈ మూవీ విడుదలకు ముందు రోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను చాలా చోట్ల ప్రదర్శించారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ను ప్రదర్శించారు. ఆ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ రావడంతో  పెద్ద ఎత్తున అక్కడ జనాలు గుమ్మి గూడడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఆ కారణంగా ఒక మహిళ మృతి చెందింది.

ఇక మహిళ మృతి చెందిన తర్వాత అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకున్న పెద్దగా ఏ ఈవెంట్లలో కూడా పాల్గొనలేదు. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ మూవీ బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ బృందం థాంక్స్ మీట్ ను కూడా చిన్న స్థాయిలోనే నిర్వహిస్తుందా ..? లేక భారీ ఎత్తున నిర్వహిస్తుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa