కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన అజిత్ కుమార్ ఈ మధ్య కాలంలో మాత్రం భారీ స్థాయి విజయాలను అందుకోవడం లేదు. వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అజిత్ కు సాలిడ్ విజయం మాత్రం దక్కడం లేదు.

ఇకపోతే తాజాగా అజిత్ కుమార్ "విడ ముయార్చి" అనే సినిమాలో హీరో గా నటించాడు. త్రిషమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో మొదటి రోజు ఈ మూవీ కి భారీ ఎత్తున కలెక్షన్లు దక్కలేదు. ఇకపోతే మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త కొత్త రికార్డులను సృష్టించడంలో విఫలం అయిన ఈ సినిమా బుక్ మై షో లో మాత్రం ఒక మంచి రికార్డును సొంతం చేసుకుంది.

బుక్ మై షో లో ఈ మూవీ కి సంబంధించిన 1 మిలియన్ ప్లస్ టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇలా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో మాత్రం ఈ మూవీ అద్భుతమైన టికెట్ సేల్స్ ను జరుపుకొని సూపర్ రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak