కన్నడ బ్యూటీ రష్మికగురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చలాకీతనంతో, అందంతో, నటనతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మకు ఒక సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఆడియన్స్ బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా నటించడానికి అవకాశం వచ్చి,  తన పాత్రకు ప్రాధాన్యత ఉంది అని తెలిస్తే మాత్రం కచ్చితంగా నటించడానికి సిద్ధం అయిపోతుంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె, 'నేషనల్ క్రష్' అనే ట్యాగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇక అదే ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ.. "2016లో కిరిక్ పార్టీ సినిమా విడుదలైనప్పటి నుంచి నేషనల్ క్రష్ అనే టైటిల్ మొదలైంది. అంతకంటే ముందు చదువుకునే రోజుల్లో కాలేజీ మొత్తానికి నేనే క్రష్. ఆ తర్వాత కర్ణాటక క్రష్.. సినిమాల్లోకి వచ్చాక నేషనల్ క్రష్ అయ్యాను. యువతతో పాటు ప్రేక్షకులందరూ కూడా నన్ను అమితంగా ఇష్టపడడం చూస్తుంటే,  నేషనల్ అనే దశ నుండి నేను ఇప్పుడు ముందుకు వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైనా ప్రేక్షకులు నన్ను కలిసి ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే ఉన్నారని చెబుతూ ఉంటే.. నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రేక్షకుల జీవితాలలో కూడా నేను భాగమైనందుకు మరింత ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇక రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో 'ఛావా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్  నటిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ఈ సినిమాలో నేను ఏసు భాయి అనే పాత్రలో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మొదట ఈ పాత్ర వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. దక్షిణాదికి చెందిన నాకు మహారాష్ట్ర మహారాణి పాత్రలో నటించే అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోయాను. ఒక రకంగా నా కెరియర్లో ఇది ప్రత్యేకమైన పాత్ర. నాకు ఈ అవకాశాన్నిచ్చిన లక్ష్మణ్ కు ధన్యవాదాలు. ఈ సినిమా తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పినా పర్వాలేదనిపిస్తోందనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: