![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-b25fe30a-ca3f-4854-a7b7-69bbe86d1efd-415x250.jpg)
ఇదిలా ఉండగా.. బాలయ్య బాబు ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఈ సినిమా తర్వాత అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. అఖండ 2: తాండవం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అయితే అఖండ 2 సినిమా ఫస్ట్ లుక్ ను మహాశివరాత్రికి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.