కోలీవుడ్ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేయగా అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సూర్య కి మంచి విజయాలు బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. కొంత కాలం క్రితం సూర్య "కాంగువ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఘోరంగా విఫలం అయింది. ఈ సినిమా ద్వారా సూర్య కు భారీ ఆపజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన సూర్య హీరో గా నటిస్తున్న మూవీ కావడం , తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: