టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు నటించిన సినిమాలలో చాలా మోవియాతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయనకు వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. ఆఖరుగా ఈయనకు మంచి విజయం దక్కి చాలా కాలమే అవుతుంది. కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సాక్ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ "జెర్సీ" మూవీ దర్శకుడు అయినటువంటి గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... VD 12 సినిమా కథ చాలా పెద్దది. ఆ సినిమా కథను ఒక భాగంలో రూపొందించలేము. కనీసం రెండు భాగాల్లో ఆ సినిమా కథను చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ మూవీ ని రెండు భాగాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ బృందం ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు టీజర్ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ అద్భుతంగా ఉన్నట్లయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd