పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమా తో తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “ రాజాసాబ్ “ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో సలార్ 2,ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు వున్నాయి.. అలాగే గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కల్కి సినిమా కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ప్రభాస్ తన సినిమాల షూటింగ్ విషయం లో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. ఇప్పటికే రాజసాబ్ షూటింగ్ పూర్తి కాగా తరువాత చేస్తున్న “ఫౌజీ” సినిమా కు ఏకంగా 60 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం..


అలాగే ఈ సినిమా టాకి పార్ట్ పూర్తికాగానే  సాంగ్స్ షూట్ కోసం ఫారెన్ వెళ్లనున్నారు..అయితే ఫౌజీ షూటింగ్ పూర్తి అయ్యాక ప్రభాస్ పూర్తిగా “ స్పిరిట్ “ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వనున్నాడు..ఇలా ప్లాన్ చేసుకోవడం తో లుక్ విషయం లో ఇబ్బంది పడాల్సి ఉండడదని భావిస్తున్నాడు.. స్పిరిట్ పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్ తో సలార్ 2 పూర్తి చేయనున్నారు.


అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ కి కంప్లీట్ కానుంది..ఆ సినిమా అయిన వెంటనే ప్రభాస్ తో సలార్ 2 మొదలెట్టనున్నాడు..సలార్ 2 కూడా కంప్లీట్ అయ్యాక ప్రభాస్ కల్కి 2 స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. ఈ లెక్కన కల్కి 2 మొదలవడానికి చాలా టైం పట్టేలా వుంది..అయితే కల్కి 2 కోసం ప్రభాస్ తన ప్లానింగ్ మార్చుకుంటారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: