టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రీతు వర్మ హీరోయిన్గా నటించింది. త్రినాద్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీ కి కథను అందించాడు. ఇకపోతే త్రినాద్ రావు నక్కిన ఆఖరుగా ధమాకా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి కూడా ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ధమాకా లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో మంచి విజయం అందుకున్న ఈ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో మజాకా మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మేకర్స్ ఒక టీజర్ ను విడుదల చేయగా అది కూడా ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగి పోయాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ సినిమాను ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అని , ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk