సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్స్ మాత్రం చాలా చాలా తక్కువ . ఫింగర్ కౌంటింగ్స్ అని చెప్పాలి . మరి ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఉన్నది ఉన్నట్లు అస్సలు మాట్లాడరు అన్న పేరు ఎప్పటినుంచో వినిపిస్తూ వస్తుంది . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ అంజలి పేరు మారుమ్రోగిపోతుంది. అంజలి చాలా చాలా గడుసు పిల్ల అని డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది అని ..తనకు ఎంత కావాలి రెమ్యూనరేషన్ ఎంత తీసుకోవాలి అన్న విషయంలో పక్కా క్లారిటీ ఉంటుంది అని..


సినిమాకి కమిట్ అయినప్పుడు ఒకలా .. కమిట్ అయిన తర్వాత మరోకలా మాట్లాడదు అని గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ఏదైనా సినిమా విషయంలో ఆమెకు ఆ సీన్ నచ్చకపోతే వెంటనే నేను అలాంటి సీన్ చెయ్యను అంటూ ముందే చెప్పేస్తుందట . ముఖం మీదే చెప్పేస్తుందట. చాలామంది హీరోయిన్స్ అలా ముందే చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరట . సీన్ షూట్ టైం అప్పుడు అన్  కవర్టబుల్గా ఉంది అంటూ ఆ సీన్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారట .



కానీ ఎంత పెద్ద బడా డైరెక్టర్ అయిన సరే నాకు నచ్చని సీన్స్ నేను చేయనే చేయను..  అలాంటి సీన్స్ అంటూ తెగ్గేసి చెప్పే హీరోయిన్ అంజలి అంటున్నారు జనాలు.  ఆ విషయం లో నిజంగా అంజలి గ్రేట్ అలాంటి టాలెంట్ ఉన్న సత్తా హీరోయిన్ అంజలి మాత్రమే అంటున్నారు అంజలి అభిమానులు. రీసెంట్ గానే  "గేమ్ ఛేంజర్" సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. సినిమా ఫ్లాప్ అయినా.. ఆమె నటనకు  మాత్రం బాగా మంచి రివ్యూ లు ఇచ్చారు జనాలు. చూడాలి మరి అంజలి ఖాతాలో నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు పడుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: