సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమందికి కెరియర్ బిగినింగ్ లోనే మంచి విజయాలు రావడంతో మంచి గుర్తింపు కూడా వస్తూ ఉంటుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంత మంది గ్లామర్ షో కు దూరంగా ఉంటూ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తమ అందాల ఆరబోతుతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించిన ముద్దుగుమ్మలు కూడా ఎంతో మంది ఉన్నారు.

ఇకపోతే కొంత మంది మాత్రం కేవలం తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ గ్లామర్ షో కు దూరంగా ఉంటూ కెరియర్ను ముందుకు సాగించే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్థాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటి వరకు నటించిన ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తుంది. దానితో ఈమె నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మంచి విజయాలు అందుకొని సినిమాలలో కూడా ఈమె నటనకు మంచి ప్రశంసలు దగ్గర సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈమె ఎంతో మంది హీరోలతో నటించిన ఈమె తన నటనతో ఆ హీరోను డామినేట్ చేస్తూ వస్తుంది.

ఇక తాజాగా ఈమె నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి నటనతో పోలిస్తే నాగ చైతన్య బెటర్ గా చేశాడు అనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో చైతూ తన నటనతో సాయి పల్లవిని డామినేట్ చేశాడు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: