![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/anushka-shetty3d07de7d-40ab-4dc6-b37c-14700f6f915e-415x250.jpg)
ఎస్ జూనియర్ ఎన్టీఆర్ - అనుష్కల కాంబోలో చాలా సినిమాలు సెట్ అయినట్లే అయ్యాయి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా మూడు సినిమాలు మాత్రం అనుష్క స్వయంగా రిజెక్ట్ చేయడం నందమూరి ఫ్యాన్స్ కు మండించేలా చేసింది . జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తో సినిమా అవకాశం వస్తే రిజెక్ట్ చేసుకుంటారా అంటూ ఫైర్ అయిపోయారు నందమూరి అభిమానులు. కొంత మంది ఘాటు గా కూడా త్రోల్లింగ్ చేశారు.
అయితే అనుష్క కథ నచ్చకే తన బాడీకి సూట్ అవ్వకే రిజెక్ట్ చేసింది . కానీ ప్రచారం మాత్రం వేరేలా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు అని.. ఆ కారణంగానే ఆమె రిజెక్ట్ చేసింది అని రకరకాలుగా మాట్లాడేసుకున్నారు జనాలు. కొన్నాలపాటు నందమూరి ఫ్యాన్స్ ఆమెపై పగ కూడా పెంచుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ మళ్ళీ చక్కబడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ - అనుష్కల కాంబోలో ఒక్క సినిమా అయినా రాకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ అలాంటి ఆలోచనలు ఏవీ కనిపించడం లేదు . వీళ్ళ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో ఆ దేవుడికి తెలియాలి అంటున్నారు అభిమానులు..!