హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సిరీస్ మూవీలలో క్రిస్ సిరీస్ మూవీ లకు మంచి స్థానం ఉంది. ఇప్పటికే క్రిష్ సిరీస్ నుండి మూడు మూవీలు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. క్రిష్ సిరీస్ మూవీలలో హృతిక్ రోషన్ హీరోగా నటించాడు. ఈ సిరీస్ మూవీస్ ద్వారా హృతిక్ రోషన్ కి అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా లభించింది. ఇకపోతే చాలా కాలంగా క్రిష్ 4 మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు.

ఇకపోతే తాజాగా క్రిష్ 4 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం క్రిష్ 4 మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి అని , అవి తుది దశకు ఆల్మోస్ట్ చేరుకున్నట్లే అని తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ నిర్మాణ విషయంలో ఇద్దరు టాలీవుడ్ హీరోలు భాగస్వామ్యం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్సినిమా నిర్మాణంలో భాగం కాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే కళ్యాణ్ రామ్ తెలుగులో అనేక సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న వార్ 2 సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా మరి కొంత కాలం లోనే విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్ నటించబోయే క్రిష్ 4 మూవీని జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: