![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntrda441063-fc56-4ead-9ab1-1e45d883cc0b-415x250.jpg)
కాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఏ పదాన్ని వాడుతూ ఉంటాడు అనే విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఊత పదం ఏంటి ..? అనేది ఇప్పుడు జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన ఎక్కువగా " నీ బొంద ..అరె నీ" అనే పదాలను ఎక్కువగా వాడుతూ వస్తారట .
దాదాపు ఒక రోజుకి 50 నుంచి 70 సార్లు ఆ పదాలు తెలియకుండానే ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి అట. అఫ్ కోర్స్ ఎవరికైనా సరే ఒక ఊత పదం అంటూ ఉంటుంది . మనకు తెలియకుండా మనం మాట్లాడేటప్పుడు ఆ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము . ఇది తెలుసుకొని నందమూరి ఫ్యాన్స్ భలే ఫన్నీగా ఉంది అంటూ నవ్వుకుంటున్నారు . అంతేకాదు ఎన్టీఆర్ సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో..?