సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడాన్ని చాలా సహజంగా చూస్తున్నారు. ఇక వీరి విడాకులు చూసిన చాలామంది పెళ్లి చేసుకోవడం ఎందుకు.. విడాకులు తీసుకోవడం ఎందుకు సింగల్ గానే ఉంటే బాగుంటుంది కదా.. కోట్లకు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ సింపుల్ గా డివోర్స్ అంటూ విడాకులు తీసుకుంటున్నారు.ఇది ఎంతవరకు న్యాయం అంటూ చాలామంది వీరిపై విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి విడాకుల గురించి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ తమన్ కి పెళ్లి పై ఎందుకు అంత విరక్తి పుట్టింది.. 

పెళ్లి చేసుకోవడం వేస్ట్ అని ఆయన ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుటి జనరేషన్ లో మ్యూజిక్ డైరెక్టర్లలో తెలుగులో ముందంజలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ అని చెప్పుకోవచ్చు. అయితే డిఎస్పి కూడా కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ అవకాశాలు మాత్రం థమన్ ని వరిస్తున్నాయి. ఇక ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు తమన్..వివాహ వ్యవస్థకి మన భారతదేశంలో మంచి స్థానం ఉంది.కానీ అలాంటి ఈ వివాహ వ్యవస్థని బ్రష్టుపట్టిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు.వాళ్లు కూడా ఫ్రీ బర్డ్స్ అయిపోయారు.వాళ్లకు నచ్చిన పనిని చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరగడం వల్ల విడాకుల వ్యవస్థకు ఇది కూడా ఒక కారణం అవుతుంది.

 సోషల్ మీడియా ఒక వ్యక్తి మనసత్వాలను పూర్తిగా మార్చేస్తోంది.అందుకే మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలను చెడగొడుతుంది. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకోవడం కంటే అసలు పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అని నా అభిప్రాయం.  పెళ్లి విషయంలో నా సలహా కోసం ఎవరు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకండి అనే  చెబుతాను అంటూ తమన్ పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఈయన వ్యాఖ్యలపై చాలామంది స్పందిస్తూ అసలు తమన్ కి తపెళ్లిపై అంత విరక్తి పుట్టడానికి కారణం ఏంటి..ఆయన భార్యతో ఏమైనా గొడవలు ఉన్నాయా.. పెళ్లి చేసుకొని ఆయన విసిగిపోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: