![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-8ef80310-38c9-418d-ad86-2b782e1d765a-415x250.jpg)
అయితే అంతా జరిగాక కూడా మరోసారి అల్లు అరవింద్ తండేల్ ప్రమోషన్స్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరుత సినిమా బిలో యావరేజ్ సినిమా అంటూ తెలిపారు. ఆ టైమ్ లో తాను రామ్ చరణ్ తో మగధీర సినిమా తెరకెక్కించి హిట్ కొట్టినట్లు చెప్పుకొచ్చారు. అది రామ్ చరణ్ పై తనకు ఉన్న ప్రేమ అని చెప్పారు. ఇది విన్న మెగా ఫాన్స్ మరోసారి మండిపడ్డారు. చిరుత సినిమా మంచి కలక్షన్స్ సాదించిందని ఫైర్ అయ్యారు. అదే ఏడాది రిలీజ్ అయిన అల్లు అర్జున్ సినిమా దేశముదురు సినిమా కన్నా కూడా చిరుత కలెక్షన్స్ ఎక్కువే అంటూ అల్లు అరవింద్ పై మండిపడ్డారు.
ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సినిమా బాగుంది.. అంటూ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉన్నాయి. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది.