![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-e1e5fb68-3427-4b0e-b3bd-b3ba75ce343f-415x250.jpg)
ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది. ఈ సందర్భంగా ఇటీవల హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. 'సినిమాను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలం అయ్యింది' అని చెప్పుకొచ్చాడు.
దీంతో నాగ చైతన్య ఇన్ని రోజులు నెగిటివిటీ చూశాడా అంటూ చర్చలు జరుగుతున్నాయి. దానికి సామ్ తో విడాకులు కారణమా అని తండేల్ ప్రమోషన్స్‌లో నాగ చైతన్య బ్రేక్ అప్ గురించి మాట్లాడిన ఓ వీడియోని ప్రస్తుతం నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో 'బ్రేకప్ జరిగితే వచ్చే పరిణామాలు నాకు తెలుసు. ఎంత బాధ ఉంటుందో కూడా నాకు తెలుసు. ఇలాంటి నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకోలేదు. కూర్చొని వెయ్యి సార్లు ఆలోచించి తీసుకున్న' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.