బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి   అనే సామెత రాజకీయాలకు బాగా సెట్ అవుతుంది..ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితులు ఉంటాయి.. ప్రస్తుతం ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు ఈసారి వారి పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది.. ఎగ్జిట్ పోల్స్ లోను, పోస్టల్ బ్యాలెట్ లో కూడా భారతీయ జనతా పార్టీ ముందు స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ విధంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా దూసుకుపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని తెలుస్తోంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.. ఇందులో 36 స్థానాలు గెలిస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.. అలాంటి ఈ తరుణంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని వర్గాల ప్రజలు బిజెపికి సపోర్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది.. 

ఢిల్లీలో దాదాపు మూడు పర్యాయాలు కాంగ్రెస్  అభ్యర్థి  షీలా దీక్షిత్ ఏకధాటిగా సీఎం అయింది. ఆమె ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కు  ఎదురు వచ్చిన పార్టీలు లేవు.. అలాంటి ఈమెని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలు ఢిల్లీ పీఠం ఎక్కింది.. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ  స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు.. దీంతో అప్పటినుంచి కాంగ్రెస్ అక్కడ నిలబడలేక పోతోంది.. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై వచ్చిన వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ తనవైపు మలుచుకుందామనుకుంది. కానీ కింది స్థాయిలో చాలామంది ప్రజలు  కాంగ్రెస్ కు అధికారం మూడుసార్లు ఇచ్చారు.

ఆ తర్వాత ఆఫ్ పార్టీకి 2సార్లు ఇచ్చారు. ఈసారి ఎలాగైనా బిజెపికి పట్టం కట్టాలనుకున్నారట. అంతేకాదు కింది స్థాయిలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆఫ్ పార్టీని ఓడించాలని  బిజెపికే ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.. ఇక్కడ బిజెపి గెలిస్తే రానున్న ఐదేళ్లలో  మళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా డల్ అయ్యేలా చేయవచ్చని భావించి బిజెపి పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు కూడా తెర వెనుక ఉండి సపోర్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: