మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదులుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి తన కెరీర్లో వదిలేసిన సినిమాలలో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నవి కూడా ఉన్నాయి. ఇకపోతే చిరంజీవి తన కెరీర్ లో ఒక సినిమా అద్భుతమైన విజయం అందుకుంటుంది అని తెలిసిన ఒక కారణంతో ఆ సినిమానే వదిలేసాడట. ఇక ఆ సినిమా ఆ తర్వాత అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుందట. అసలు ఆ సినిమా ఏది ..? ఎందుకు ఆ మూవీ ని చిరంజీవి వదిలేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కోడి రామకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరోగా మన్యంలో మొనగాడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని మొదట కోడి రామకృష్ణ , అర్జున్ తో కాకుండా చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి కథ సూపర్ గా ఉంది. కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ నాపై తీస్తే అస్సలు వర్కౌట్ కాదు. ఎందుకు అంటే ప్రస్తుతం నా ఈమేజ్ పెరిగింది. ఈ కథకు నా ఈ కి అసలు సెట్ కాదు. కాదని తీస్తే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నువ్వు వేరే హీరోతో ఈ సినిమా చెయ్యి బ్లాక్ బస్టర్ అవుతుంది అని సలహా ఇచ్చాడట. ఇక కోడి రామకృష్ణ ఆ తర్వాత అర్జున్ తో ఈ కథను మన్యంలో మొనగాడు అనే టైటిల్ తో రూపొందించగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఇలా చిరంజీవి తన ఈమేజ్ కి సెట్ కాదు అని వదిలేసిన కథతో కోడి రామకృష్ణ , అర్జున్ తో మన్యంలో మొనగాడు అనే టైటిల్ తో సినిమాను రూపొందించగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: