![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sankranthiki-vasthunam-ott-zee5386d55d7-6e7a-4efd-8f61-b1b65e26e8a6-415x250.jpg)
ఇప్పట్లో సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్లో కలెక్షన్స్ కూడా తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటిలో వస్తుందా అంటూ నేటిజెన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఇప్పటికీ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓటీటి రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన ZEE-5 భారీ ధరకు డిజిటల్ హక్కులను సైతం సొంతం చేసుకున్నదట. అది కూడా ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అతి త్వరలోనే ఓటిటీ డేటును కూడా అనౌన్స్మెంట్ చేసేలా జి-5 చూస్తోందట. నైజాంలో ఒక్కటే 40 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని అందించినట్లు మేకర్స్ ఇటి వలే తెలియజేశారు. అలాగే వెంకటేష్ తన తదుపరి సినిమా రామానాయుడు 2 సీజన్లో నటించబోతున్నారు ఈ ప్రాజెక్టు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ రావుపూడి తన తదుపరి చిత్రాన్ని హీరో మెగాస్టార్ తో చేయబోతున్నారట. ఈ సినిమా కూడా ఈ ఏడాదే పట్టాలెక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెండితెర పైన సక్సెస్ అయిన సంక్రాంతికి వస్తున్న OTT లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.