రష్మిక మందన్న.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన ఇదే పేరు మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా తో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఆమె ఖాతాలో ఆరు బడా సినిమాలే ఉన్నాయి . 6 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాలు కావడం గమనార్హం . ఈ ఆరు సినిమాలు హిట్ అయితే ఆమె కెరియర్ ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లిపోతుంది. మరి ముఖ్యంగా రష్మిక మందన్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది . ఆ విషయం అందరికి తెలుసు.


కాగా రీసెంట్గా రష్మిక మందన్నా ఖాతాలో ఒక బిగ్ బడా ఆఫర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఆఫర్ ని సింపుల్ గా రిజెక్ట్ చేసిందట ఈ అందాల ముద్దుగుమ్మ. అదేంటి ఇంటికి వచ్చి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ ఎందుకు చేసింది అనేగా మీ డౌట్. అది ఆమె కి నచ్చని ఆఫర్. అందుకే రిజెక్ట్ చేసిందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే ఏకంగా ఏడు కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారట . అయినా సరే ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు రష్మిక మందన్నా.



పెద్ద బడా డైరెక్టర్ అయిన ..బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే హీరో అయినా..  ఆమె మాత్రం అలా ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో రష్మిక మందన్నా డెసిషన్ ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయం వెనక ఏదో మర్మం ఉంటే ఉంటుంది అని .. అలా రిజెక్ట్ చేస్తున్నట్లు యాక్ చేస్తేనే కదా ఇంకా ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తారు .. ఇది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ ల  ట్రిక్ అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . రష్మిక మందన్నా మంచి చేసిన కూడా అది నెగిటివ్ గానే ఆలోచిస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: