టాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలా తక్కువ సినిమాల్లో నటించిన మంచి విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంపాదించుకున్న యువ నటీమణుల్లో నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరో గా రూపొందిన మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈ నటి గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమె నటించిన బెదురులంక 2012 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కొంతకాలం క్రితం ఈ నటి రూల్స్ రంజన్ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఈమె తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక కొంత కాలం క్రితం ఈ నటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న ఈమెకు మాత్రం స్టార్ హీరోల సినిమాలలో వరుస పెట్టి అవకాశాలు దక్కడం లేదు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: