సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో కొంత మంది కి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాలు దక్కుతూ ఉంటాయి. అలాగే ఆ తర్వాత క్రేజీ సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతాయి. అలాంటి వారు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు అనే అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్త పరుస్తూ ఉంటారు. అలా మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఈజీగా చేరుకుంటుంది అనే దశ వరకు వెళ్లి వరుస అపజాయలతో డీలా పడిపోయిన ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు.

ఈమె ఉప్పెన అనే మూవీ తో తెలుగు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఆ తర్వాత వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఈమెకు ఉప్పెన మూవీ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలతో మంచి విజయాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో ఈమె క్రేజ్ క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక కొంత కాలం క్రితమే ఈమె ఓ మలయాళ సినిమాలో కూడా నటించింది.

సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ హిందీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం ఈ ముద్దు గుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈమె నిజం గానే హిందీ లో ఐటమ్ సాంగ్ చేస్తే అది సక్సెస్ అయినట్లయితే హిందీ లో కూడా వరుస పెట్టి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: