నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించగా... సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య ఇరగదీసేసాడని అక్కినేని అభిమానులు గొప్పలు పోతున్నారు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య నటన న భూతొ న భవిష్యతి అని అంటున్నారు. ఇక తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలవగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉందని భోగట్టా. ఇక ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇదేనని కూడా బయట టాక్ ఉంది. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారు.
అయితే మొత్తంగా సినిమా అయితే సూపర్ హిట్ టాక్ వచ్చ్చినప్పటికీ... చాన్నాళ్ల తరువాత 'తండేల్' సినిమాతో హిట్ కొట్టామనే ఆనందం ఒక్కరోజు కూడా నాకు మిగల్చలేదు కదా అని హీరో నాగ చైతన్య బోరుమంటున్నట్టు సమాచారం. విషయం ఏమిటంటే? సినిమా మొత్తం ఆన్‌లైన్లో ప్రత్యక్షం అయింది. 'తండేల్' మూవీ హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి రావడంతో చిత్ర యూనిట్, మేకర్స్ అందరూ గందరగోళంలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ పైరసీ వల్ల 'తండేల్'కు భారీ ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మి జిల్లా, మూవీస్ వంటి వెబ్‌సైట్‌లలో హెచ్డి క్వాలిటీతో 'తండేల్'ప్రత్యక్షం కావడం కొసమెరుపు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి!