నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా వీరికి సంబంధించి రూమర్లు రావడం నెగిటివ్ కామెంట్లు రావడం మాత్రం ఆగడం లేదు.. అయితే తాజాగా తండేల్ మూవీ ప్రమోషన్స్ లో నాగచైతన్యకు మళ్ళీ సమంతతో విడాకుల గురించి ఓ ప్రశ్న ఎదురైంది.అయితే ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.. సమంత నేను విడిపోవడం అనేది ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. మేము విడిపోయే ముందు 1000 సార్లు ఆలోచించాము. కానీ కలిసి ఉండడం కష్టం అనిపించి ఇద్దరం పూర్తిగా నిర్ణయించుకొని విడాకుల విషయాన్ని అనౌన్స్ చేసాము.కానీ ఈ విడాకుల వార్త బయట పెట్టడంతోనే చాలామంది మాపై నెగటివ్ కామెంట్లు చేశారు. ఇక నేను ఏదైనా ఒక పోస్ట్ పెడితే చాలు దాని కింద ఎన్నో నెగెటివ్ కామెంట్లు వచ్చేవి.ఇవి నేను చాలా సార్లు చదివాను. 

అది మా పర్సనల్ విషయం.అందులో మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి అని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు.మా విడాకులు వాళ్లకు సరదాగా అనిపించి ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారు.ఇప్పటికి కూడా అవి ఆగడం లేదు. విడాకులు తీసుకోవడం అనేది నేనొక్కడినే చేసిన పని కాదు. సమాజంలో ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. కానీ ఎన్ని సార్లు చెప్పిన ఈ వార్తకు పుల్ స్టాప్ పెట్టడం లేదు. నేను ఏ ఈవెంట్ కు వెళ్ళినా కూడా విడాకులకు సంబంధించి ప్రశ్నలే అడుగుతున్నారు.అలాంటి ప్రశ్నలు అడగద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతూ మానిపోయిన గాయాన్ని మళ్ళీ ఎందుకు గెలుకుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..

ఇప్పటికైనా మా విడాకుల వార్తలపై ఎలాంటి వార్తలు రాయకుండా ఈ విషయానికి ఇక్కటితో పుల్ స్టాప్ పెడతారని నేను భావిస్తున్నాను అంటూ విడాకుల వార్తలపై మరొకసారి ఘాటుగా స్పందించారు నాగచైతన్య. ఇక శోభిత నా లైఫ్ లోకి వచ్చాక అంతా మంచే జరిగిందని,మా ఇద్దరి పరిచయం ఇంస్టాగ్రామ్ ద్వారా జరిగింది అని, నా లైఫ్ లో అసలైన హీరో శోభితనే అని,నాకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఆమె గౌరవించినప్పటికీ చాలామంది శోభితను కూడా బ్యాడ్ చేస్తున్నారు అంటూ బాధపడ్డారు నాగచైతన్య.ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: