సినిమా ఇండస్ట్రీ లో వరుసగా విజయాలు ఉన్న ముద్దుగుమ్మలకు అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ముడుతూ ఉంటుంది. అదే ఎవరికైనా వరుస విజయాలు లేనట్లయితే వారి క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. అలాగే వారికి ఇచ్చే పారితోషికం కూడా క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఓ ముద్దు గుమ్మకు మాత్రం వరుసగా ఏడు సినిమాల ద్వారా అపజయాలు వచ్చిన కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. అలాగే వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. భారీ మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటుంది.

బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు పూజా హెగ్డే. ఈమెకు ఆఖరుగా 2021 వ సంవత్సరంలో విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. ఆ మూవీ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి కూడా ఈమెకు అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. కేవలం అవకాశాలు దక్కడం మాత్రమే కాకుండా ఈమెకు భారీ మొత్తంలో పారితోషకం కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ముద్దు గుమ్మకు విజయాలు లేకపోయినా భారీ స్థాయిలో పారితోషకం దక్కుతూ ఉండడంతో పూజా హెగ్డే కు సరైన విజయాలు దక్కితే ఈమె క్రేజ్ అదిరిపోయే రీతిలో పెరుగుతుంది అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా పూజ హెగ్డే , షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన వేద అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: