![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/lucky-menalisade-do-you-know-much-about-remunerationf08a8ef3-0f54-4666-b8c8-b0076d992236-415x250.jpg)
ఇంకేముంది... కట్ చేస్తే, ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. రోజుకు రూ. వెయ్యి రూపాయలు సంపాదించాలన్న లక్ష్యంతో మహాకుంభమేళాకు వచ్చిన మోనాలిసా.. నాలుగో రోజునుంచే వైరల్ కావడంతో ఇపుడు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగి, లక్షాధికారి అయిపోయింది. అవును, ఇటీవలే ఓ సినిమాలో ఆమె నటించేందుకు అంగీకరించింది. 'ది డెయిరీ ఆఫ్ మణిపుర్' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు మోనాలిసా సైన్ చేసింది. ఇప్పటికే మోసాలిసాకు చిత్ర నిర్మాతలు రూ. 21 లక్షల చెక్ ఇచ్చారట. దీంతోపాటు లోకల్ బిజినెస్ వాళ్లు తమ సంస్థల పబ్లిసిటీ కోసం రూ. 15 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారని టాక్.
దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం మోనాలిసా ముంబయిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు అయితే మొనాలిసామీద ఏకంగా సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ముజ్ కో రానాజీ మాఫ్ కర్ణా పాటకు వైరల్ గర్ల్ మోనాలిసా డ్యాన్స్ చేసినట్లు కొందరు ఆర్టిఫీసియల్ ఇంటిలిజెన్స్(AI) సాయంతో వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయగా ఓ వీడియో అభ్యంతరంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏఐతో వీడియోలు తీయడం ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఇది ఒరిజినల్ వీడియో అని.. ఏఐ వాడలేదని వాదిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మోనాలిసాను సినిమాల్లో చూడబోతున్నామని అన్నారు.