టాలీవుడ్ నటి కుంభమేళాలో సన్యాసినిగా మారారు. నటి ఇషిక తనేజా కుంభమేళాకు వెళ్లి అక్కడ సన్యాసం స్వీకరించారు. ఇకనుంచి తాను ఎలాంటి సినిమాలలోనూ నటించనని పుణ్యస్నానం చేసిన అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కాగా, ఇషిక 2018 సంవత్సరంలో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ కైవసం చేసుకున్నారు. అనంతరం సినిమాల మీద ఆసక్తితో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2016 లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా స్వయంగా రాష్ట్రపతి అవార్డును అందుకోవడం గమనార్హం. 

కాగా, గత కొన్ని రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్లి పవిత్ర త్రివేణి సంగమాన్ని దర్శించుకోవడం జరిగింది. కుంభమేళాకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనాలు తరలి రావడం విశేషం. మరొకవైపు సినీ సెలబ్రిటీలు సైతం ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.


ఇప్పటికే అఘోరాలు, ఋషులు, సాధువులు పలువురు సినీ సెలబ్రి టీ లు, రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనం చేసుకుని వెళుతున్నారు. అయితే ఈ కుంభమేళాలో ఓ హీరోయిన్ సన్యాసిగా మారిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సీనియర్ నటి మమతా కులకర్ణి ఇటీవల కుంభ మేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత సన్యాసం తీసుకున్నారు.

దీంతో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు మరో బాలీవుడ్ నటి ఇషికా తనేజ కూడా సన్యాసిగా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా సినీ హీరోయిన్లు సన్యాసం తీసుకోవడం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారుతుంది. సినిమాల పరంగా కెరియర్ మంచిగా కొనసాగుతున్న సమయంలో హీరోయిన్లు ఇలా చేయడం ఏంటి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అలా చేయడం మంచిదేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: