నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్' నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. చైతన్యను ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో వెయిట్ చేశారు. ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉండటంతో, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక పంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. కొంతమందికి సినిమా బాగానే అనిపించినా, చాలామంది మాత్రం ఇంకాస్త బాగుంటే బాగుండేది అని పెదవి విరుస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్‌ అయితే హిట్ కోసం ఎంతగానో ఎదురుచూసి ఇప్పుడు డీలా పడిపోయారు.

చందూ మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఓ గ్రామంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గుజరాత్ కు చేపల వేటకు వెళ్లిన 22 మంది జాలర్లు దారి తప్పి పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోతారు. అక్కడ పాక్ ఆర్మీకి చిక్కి జైలు పాలవుతారు. ఆ తర్వాత వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా తిరిగి తమ ఊరికి చేరుకున్నారనేదే సినిమా కథ. స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది కానీ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడని అంటున్నారు.

సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్ చెబుతున్న దాని ప్రకారం.. సినిమాలో కొన్ని సీన్లు బాగా సాగదీసినట్టు అనిపించాయట. ముఖ్యంగా పాకిస్థాన్ జైలు ఎపిసోడ్ అయితే మరీ లెంగ్త్ ఎక్కువైందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్ మొదట్లో తక్కువే అనుకున్నారట. కానీ, షూటింగ్ చేసే టైమ్‌కి దాదాపు 90 కోట్ల రూపాయలు ఖర్చయిందని టాక్. అనవసరమైన సీన్లు పెట్టడం వల్లే బడ్జెట్ పెరిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే.. డైరెక్టర్ సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువ తీసుకున్నాడని అంటున్నారు. నిజానికి తండేల్ రాజు  అనే ఆ యన నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీశారు, పాకిస్థాన్ జైలులో ఉన్నప్పుడు తన భార్యకు ఉత్తరం మాత్రమే రాయగలిగాడట. అది కూడా ఆమెకు నెలల తర్వాత చేరింది. కానీ సినిమాలో మాత్రం తండేల్ రాజు జైలు నుంచి డైరెక్ట్‌గా ఫోన్లు మాట్లాడినట్టు చూపించారు. పాకిస్థాన్ జైల్లో అంత ఈజీగా ఫోన్లు ఎలా ఇస్తారు అనేది ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్.

నిజానికి ఆ టైంలో పాకిస్థాన్ జైల్లో ఒక భారతీయ ఖైదీపై దాడి జరగడంతో, అక్కడున్న ఇండియన్ ఖైదీలందరూ భయంతో బతికారు. కానీ సినిమాలో ఆ టెన్షన్ సీన్లను మాత్రం చూపించలేదు. ఇలాంటి కొన్ని నమ్మశక్యంగా లేని సీన్ల వల్లే సినిమాపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ డీటైల్స్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా వేరే లెవెల్‌లో ఉండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా, ఈ విమర్శల మధ్య కూడా 'తండేల్' బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, చైతన్య మాత్రం తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: