టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నుంచి తాజాగా రిలీజ్ అయిన చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా... అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారీగా వసూళ్లను రాబట్టింది.


ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఈ సినిమా భారీగా కలెక్షన్ల ను రాబట్టడం విశేషం. మొదటి రోజు ఈ సినిమా సుమారు 3 లక్షల 50 వేల డాలర్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిందని నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, వివాహం తర్వాత నాగచైతన్య నుంచి వచ్చిన మొదటి చిత్రం తండేల్.


చాలా రోజుల తర్వాత నాగచైతన్య మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. శోభిత రాకతో నాగచైతన్యకు అదృష్టం కలిసి వచ్చిందని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా... ఈ సినిమా నిన్న సక్సెస్ అయిన సంతోషంలో నిన్న సాయంత్రం చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. కాగా, నిన్న సాయంత్రం చైతు, శోభిత ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్న సమయంలో శోభిత తండేల్ అని రాసి ఉన్న టీ షర్టును వేసుకున్నారు.


ఆ టీషర్ట్ వేసుకొని చైతన్య భుజంపై చేయి వేసి నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వీడియో తీశారు. అనంతరం బయటికి వచ్చే సమయంలో అదే టీషర్టును నాగచైతన్య వేసుకొని కనిపించాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.





మరింత సమాచారం తెలుసుకోండి: