![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/have-you-seen-how-wild-the-characters-are-has-the-commercial-meaning-changed1aaa58b4-99b3-4148-a7ef-ec052f560955-415x250.jpg)
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో రంగస్థలం లాంటి సినిమాను సుకుమార్ మొదలుపెట్టిన అప్పుడు అంతా షాక్ అయ్యారు .. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అతని నటనతో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు చరణ్ .. సినిమా వచ్చి ఆరు సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ ఎక్కడ పోలేదు. ఆ తర్వాత పుష్ప కోసం అల్లు అర్జున్ కూడా అలాగే మార్చేసాడు సుకుమార్ .. పుష్పతో అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చి పడింది .. ఇక ఇప్పుడు తాజాగా పుష్పా 2 లోను అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ప్రధానంగా కొన్ని సన్నివేశాలో అల్లు అర్జున్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు .. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు .. ఇదే కోవాలో దసరాతో నాని కూడా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేశాడు.
ఇక దేవరలోను ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మరోసారి చూపించాడు .. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే కారణం ఎన్టీఆర్ నటనే . ఇక ఇప్పుడు వార్ 2 లో కూడా ఎన్టీఆర్ అరివేరా మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు .. అలాగే ప్రశాంత్ నీల్‌తో సినిమా అంటే కూడా అది ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా గేమ్ చేంజర్ లో అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు .. ఇక ఇప్పుడు తాజాగా శ్రీకాంత్ ఓదెలతో కూడా మెగాస్టార్ ఇలాంటి మాస్ సినిమా నే ప్రకటించారు .. ఇక ఇప్పుడు హీరోలు ఎవరైనా కూడా కమర్షియల్ గా ఉంటూనే తమ క్యారెట్ నటనతో ఆధరర్గోడుతున్నారు . ఇక మొత్తానికి ఈ మార్పు మన మంచికే అంటున్నారు ప్రేక్షకులు.