60లో ఉన్నారు ఇంకా వీళ్లేం సాధిస్తారు .. సీనియర్లు అయిపోయారు కుర్ర హీరోలతో పోటీ పడతారా ? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు ఇంకా ఎనర్జీ వీరిలో ఉంటుందా ? ఇలాంటి అనుమానాలు అసలు ఎవరిలోనూ అక్కర్లేదు .. మన సీనియర్ హీరోస్ దెబ్బకి ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది .. ఒక్కొక్కరు ఒక్కో రికార్డును తమ ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నారు .. ఆ రికార్డులు ఏమిటి అనేది ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఇక మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో గత చాలా రోజులుగా సీనియర్ హీరోస్ ఫుల్ జోష్లో దూసుకుపోతున్నారు .. ఒక నాగార్జున మాత్రమే ఇంకా ఫర్ఫెక్ట్ కం బ్యాక్ ఇవ్వలేదు .. కానీ మిగిలిన ముగ్గురు హీరోలు మాత్రం ఇండస్ట్రీలో వ‌రుస‌ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు.


ఇక రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు గా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర తన ఏంటో చూపించాడు విక్టరీ వెంకటేష్ .. అలాగే సీనియర్ హీరోల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డు కూడా వెంకీ పేరు మీద ఉంది .. గత పాతికేళ్ల కిందట కలిసుందాం రా సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లతో రీజినల్ సినిమాలోనే అదిరిపోయే ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు. అలాగే హైయెస్ట్ కలెక్షన్స్ వెంకటేష్ పేరు మీద ఉంటే ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ స్టార్ చిరంజీవి పేరు మీద ఉంది ఈ రికార్డు .. రీ ఎంట్రీలో రఫ్ ఆడిస్తున్నారు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 తో 100 కోట్ల షేర్ అందుకున్న మెగాస్టార్ సైరా , వాల్తేర్ వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ రాబ‌ట్టారు.


అలాగే 100 కోట్ల గ్రాస్ ఎక్కువగా అందుకున్న మరో సీనియర్ హీరో నట‌సింహం బాలయ్య .. ఈ సీనియర్ స్టార్ హీరో అఖండ తర్వాత తన విశ్వరూపం చూపిస్తున్నాడు .. అఖండతో మొదలైన సెంచరీలు వీర సింహారెడ్డి భగవంద్‌ కేసరి, డాకు మహారాజ్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మూల స్తంభాలుగా ఉన్న ఈ నలుగురు హీరోలలో ముగ్గురు సీనియర్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో రికార్డును తమ జేబులో వేసుకున్నారు .. కానీ వీరిలో నాగార్జున మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు .. ఈ సీనియర్ హీరోని కూడా తక్కువంచిన వేయడానికి వీల్లేదు .. సరైన స్టోరీ పడితే కింగ్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు .. అలాంటి ఓ మూమెంట్ కోసమే ఈ అక్కినేని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు .. ఇక మరి అదికూడా జరిగితే ఈ నలుగురు హీరోలు కూడా ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: