తెలుగు చిత్రపరిశ్రమల కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలను చూస్తుంటే అరుంధతి కోట గుర్తొస్తూ ఉంటుంది .. దర్శకులు ఒక్కసారి అందులోకి వెళ్లారంటే బయటికి రాలేకపోతున్నారు ముందు ఒకటి తర్వాత రెండు అంటూ అక్కడే లాక్ అయిపోతున్నారు .  అలాగే అగ్ర దర్శకులను పట్టు జారిపోకుండా అడ్వాన్స్ ఇచ్చేసి వారి దగ్గరే ఒడిసిపెట్టుకుంటున్నారు నిర్మాతలు .. ఇక మరి ఎవరా నిర్మాతలు అక్కడ లాక్ అయిన దర్శకులు ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో కొందరు దర్శకుల కేరాఫ్ అడ్రస్లు మారిపోతూ వస్తున్నాయి .. ఎన్నో సంవత్సరాలుగా ఒక్క నిర్మాతకే వరుస సినిమాలు చేస్తున్నారు .. వారు సినిమాలు చేస్తున్నారు కంటే అక్కడే వాళ్లను బయటికి వెళ్లకుండా లాక్ చేస్తున్నారు అనేది నిజం .. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్..  వీరంతా ఒకే నిర్మాణ సంస్థలో గత కొన్ని సంవత్సరాలగా వ‌ర‌స సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.


ఇక దర్శకుడు త్రివిక్రమ్ ను తీసుకోండి .. ఈ దర్శకుడు మూవీ అనౌన్స్ చేశారంటే చాలు దాని వెనక హారిక హాసిని క్రియేషన్స్ కచ్చితంగా ఉండాల్సిందే .. 2012లో వచ్చిన జూలాయి నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా వరకు త్రివిక్రమ్ సినిమాలన్నీ ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే వస్తున్నాయి. మిగిలిన నిర్మాతలకు త్రివిక్రమ్ ఆసలు అందుబాటులోనే ఉండరు .. మరో అగ్ర దర్శకుడు అనిల్ రావుపూడి పూర్తిగా దిల్ రాజు ఇంటి మనిషి అయిపోయాడు .. అనిల్ చేసిన 8 సినిమాల్లో ఆరు సినిమాలు దిల్ రాజు సంస్థలోనే వచ్చాయి.మరో అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP లోకి అడుగుపెట్టారు .. ప్రెసెంట్ స్టార్ హీరో ధనుష్ తో కుబేర సినిమాని కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే చేస్తున్నారు .. రీసెంట్ గానే మరో సినిమాను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ లో ప్రకటించారు శేఖర్ కమ్ముల .. అలాగే తండేల్‌ తర్వాత మరోసారి గీత ఆర్ట్స్ లోనే సినిమా చేయబోతున్నారు చందు మండేటి.


ఇక రంగస్థలం సినిమా దగ్గరనుంచి మైత్రి లోనే ఉండిపోయారు సుకుమార్ .. పుష్పతో మైత్రి కి చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చారు .. ఇక తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే సినిమాని కూడా ఈ బ్యానర్ లోనే చేయబోతున్నాడు సుకుమార్ .. అలాగే మరో అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగసైతం టీ సిరీస్  భూషణ్ కుమార్ తోనే కబీర్ సింగ్ , య‌నిమల్ సినిమాలు చేశారు .. ఇక ఆయన తర్వాత చేయబోయే స్పిరిట్ తో పాటు అల్లు అర్జున్ , ఎన్టీఆర్ సినిమాలు కూడా ఇదే బ్యానర్ లో ఉండబోతున్నాయి. ఇలా పైన చెప్పిన దర్శకులందరూ ఒక్క నిర్మాణ సంస్థలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బయటకు రాకుండా అందులోనే ఉండిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: