![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-heroesf3711873-28c4-47bc-b4c9-4078f0839f63-415x250.jpg)
ఇక తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన అజిత్ ఇక్కడ మార్కెట్ మాత్రం క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు .. సక్సెస్ , ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాను 100 కోట్లు వసూళ్లు సాధిస్తున్న విజయ్ కూడా టాలీవుడ్ మార్కెట్ లో అనుకున్నంత స్థాయిలో బజ్ అందుకోలేకపోతున్నారు . ఇక గతం లో తెలుగులో మంచి మార్కెట్ అందుకున్న సూర్య లాంటి హీరోస్ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో కలెక్షన్ల విషయంలో ఎంతో వెనకంజిలో ఉన్నారు .. గతంలో తెలుగులో సంచలనాలు అందుకున్న రజినీకాంత్ , కమలహాసన్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు వెనకంజ లో ఉన్నారు .
జైలర్ తో తెలుగులో మంచి కలెక్షను సాధించిన రజనీకాంత్ , తర్వాత వచ్చిన వేట్టయన్‌తో నిరాశపరిచారు .. విక్రం తో మంచి కలెక్షన్ అందుకున్న కమలహాసన్ భారతీయుడు 2 డిజాస్టర్ ను అందుకున్నారు .. తెలుగు హీరోలంతా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంటే .. తమిళ హీరోలు ఇలా రీజినల్ రేంజ్ కి పడిపోవటం తమిళ సర్కిల్స్ తో గట్టిగా డిస్కషన్ జరుగుతుంది. మరి రాబోయే రోజులైనా తమిళ హీరోలు తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ అందుకుంటారు లేదో చూడాలి .