ఈ భేటీకి అమితాబచ్చన్, మోహన్లాల్, షారుక్ ఖాన్, చిరంజీవి, రజనీకాంత్ ,ఏఆర్ రెహమాన్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రిలయ న్స్ అధినేత ముకేశ్ అంబానీ తో పాటు గూగుల్ సీఈవో సుందర్, అలాగ ఆనంద్ మహేంద్ర, సత్య నాదెళ్ల తదితర వ్యాపార దిగ్గజలు సైతం ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా వారందరి సలహాలు సూచనలు కూడా ప్రధాన మోడీ తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ భేటీ అనంతరం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా.. ప్రధాన మోదీకి సైతం ధన్యవాదాలు తెలియజేస్తూ.. అడ్వైజరి బోర్డులో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీ తో వీడియో కాన్ఫరేషన్లో మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ప్రధాన మోదీ ఆలోచనలు సైతం భారతదేశాన్ని ముందుకు నడిపించేలా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేశారు. మరి చిరంజీవికి ఇచ్చినటువంటి ఈ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చడానికి కృషి చేస్తారో చూడాలి. ఇండియాని గ్లోబుల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలని వాటి పైన కూడా చిరంజీవి కీలకమైన సూచనలను కూడా ఇచ్చారట. మొత్తానికి బిజెపి వైపుగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది చిరంజీవి.