![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chhatrapati-shivaji1de7a114-215a-40c4-9373-61d86790c149-415x250.jpg)
ఇక ఇలాంటి గొప్ప కథతో వస్తున్నారు కాబట్టి ముందుగానే సినిమా యూనిట్ ను చరిత్రకారులు సున్నితంగా హెచ్చరించారు .. ఇక ఇప్పుడు ఛావా పై ఎలాంటి వివాదాలు వస్తున్నాయి ? అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక ఈ ట్రైలర్ లో శంబాజీ ఆయన భార్య యేసుబాయ్ లెజిమ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్లు డాన్స్ చేసినట్లు చూపించారు .. తమకున్న క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనవి చూపిస్తే లేనిపోని వివాదాలు వస్తాయని ఈ మూవీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు ఇప్పటికే కొన్ని సూచనలు అందుతున్నాయి. అలాగే వాటన్నింటినీ తమ పరిగణనలోకి తీసుకున్నట్టు మేకర్స్ చెప్తున్నారు .. మరోపక్క ఛావా సినిమాలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్యారెక్టర్ ను చాలా నెగిటివ్ గా , విలన్ గా చూపించారనే వాదన మరికొంతమంది అంటున్నారు.
ఇప్పుడు దీంతో సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే చరిత్రకారులకు స్పెషల్స్ షో వేయాల్సిందే ని అంటున్నారు .. ఇక మరి దీనికి ఛావా మేకర్స్ ఓకే చెబుతారా ? లేక గతంలోనూ పద్మావత్ , జోధా అక్బర్ లాంటి చాలా చరిత్రాత్మక సినిమాలకు వివాదాలు తప్పలేదు తర్వాత ఆ సినిమాలు ఎలాంటి సంచలనలు క్రియేట్ చేసాయో అందరికీ తెలిసిందే . ఇక మరి ఛావా కూడా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు అందుకుంటుందో చూడాలి.