ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే .. ఇక ఈమె ఎక్కువగా విలన్ పాత్రలో పేరు తెచ్చుకుంది.. అలాగే తన వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచేది .. విడాకుల తర్వాత ఒంటరిగా ఎన్నో సవాలను ఎదుర్కొని తన ఇద్దరు కవల పిల్లల ఆలనా పాలనా పోషణ దగ్గరుండి చూసుకుంది .. రీసెంట్గా చేరిన ఓ ఇంటర్వ్యూలో ఈమె తన 16 సంవత్సరాల వయసులో పెళ్లి ఆ తర్వాత 18 సంవత్సరాల వయసులో విడాకులు ఇలా తన జీవితంలో జరిగిన సంచలనాల గురించి చెప్పుకొచ్చింది.
అలాగే విడాకుల తర్వాత తను ఎన్ని బాధలు పడ్డానో దాని నుంచి ఎలా బయటకు వచ్చిందో వాటి గురించి కూడా వివరించి .. విడాకుల తర్వాత తనను తాను ప్రశాంతంగా మార్చుకోవడానికి దాదాపు నెలరోజుల పాటు ఒంటరిగా గదిలోనే ఉండిపోయాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పింది .. ఇక తన పిల్లలు క్షితిజ్, సాగర్ తమ తండ్రి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే తన మాజీ భర్త ఇప్పటికే తన పిల్లలను కలవలేదని .. పిల్లలు ఏడాదిన్నర వయసు నుంచి తన తండ్రితో మాట్లాడలేదని కూడా ఈమె చెప్పకు వచ్చింది . ప్రస్తుతం ఈ సీనియర్ నటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .