అక్కినేని స్టార్ హీరో నాగుచైతన్య ప్రజెంట్ తండెల్‌ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు .. నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది .. రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది .. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది .. అటు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది ..


విదేశాల్లో ఈ సినిమా మొదటి రోజు 3 లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టండి. అఫీషియల్ గా చిత్ర యూనిట్ కూడా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక పోస్టర్ కు అలలు మరింత బలపడుతున్నాయి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది .. దీంతో త్వరలోనే ఈ సినిమా ఆఫ్ మిలియన్ డాలర్ మార్కు దాటేస్తుందని అభిమానులు కూడా అంటున్నారు .. ఇక మరో పక్క బుక్ మై షో లో 24 గంటల్లో సుమారు రెండు లక్షల పైగా తండెల్ టికెట్స్ అమ్ముడైపోయాయి .. ఈ మూవీ  ట్రెండింగ్ లో కొనసాగుతుంది .. ఈ సినిమాతో నాగచైతన్య మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు .. నాగచైతన్య కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.  ఈ సినిమా ఇండియాలో 10 కోట్లకు పైగా మొదటి రోజు కలెక్షన్ రాబట్టినట్టు తెలుస్తుంది .. నాగచైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని  అంటున్నారు.


ఇక ఈ సినిమాలో రాజు , సత్య క్యారెక్టర్ లో నాగచైతన్య , సాయి పల్లవి జీవించేసారని .. ప్రధానంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నాగచైతన్య ఏడిపించేసారంటూ .. ప్రశంసలు వస్తున్నాయి.. వీరిద్దరి మధ్య హృదయమైన ప్రేమను ముడిపెడుతూ.. దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. ఈ సినిమాకు సంగీతం మరో హైలెట్. ఇలా తండేల్ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.. ఈ సినిమా విజయంతో అక్కినేని అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల కల ఈ సినిమాతో అయినా నెరవేరుతుందో లేదో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: