![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sai-pallavief6adb16-cd12-4766-a0f0-a92a69cd3d9f-415x250.jpg)
కాగా సాయి పల్లవి పర్ఫామెన్స్ కూడా బాగుందని .. ఆమె నెమలిలా డాన్స్ చేసేసింది అంటూ పోగిడేస్తున్నారు . ఇదే మూమెంట్లో సాయి పల్లవి ఒక బిగ్ పడా సినిమాలో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. మనకు తెలిసిందే పుష్ప2 సినిమా తర్వాత సుకుమార్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యారు. ఆల్ మోస్ట్ ఈ సినిమా కి సంబంధించిన అన్ని స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అయిపోయాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అంటూ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "తండేల్" సినిమాలో సాయి పల్లవి పర్ఫామెన్స్ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారట మూవీ మేకర్స్. ఆల్రెడీ సుకుమార్ కి సాయి పల్లవి అంటే ఓ ప్రత్యేక గౌరవం . లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చింది కూడా ఆయనే . కాగా ఇదే మూమెంట్లో సాయి పల్లవి ని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు . ఫైనల్లి సుకుమార్ ఆ కోరిక తీర్చుకోపోతున్నాడు అంటున్నారు జనాలు. దీంతో రామ్ చరణ్ - సాయి పల్లవి కాంబో సెట్ అయినట్లు అయింది..!