సంక్రాతి కానుకగా బాలయ్య 'డాకు మహారాజ్‌' సినిమాతో నందమూరి అభిమానులను ఖుషీ చేసిన సంగతి విదితమే. అఖండ సినిమా తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల వరుస విజయాలను నమోదు చేయడం వలన అభిమానులు పండగ చేసుకున్నారు. వరుసగా 4 సినిమాలతో వంద కోట్లు, అంతకు మించిన కలెక్షన్లతో సీనియర్ హీరోగా బాలకృష్ణ మంచి స్వింగ్ లో ఉన్నారు. డాకు మహారాజ్‌ సినిమా తర్వాత బాలకృష్ణ 'అఖండ 2'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వచ్చి హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

కాబట్టి వీరి కాంబోకి ఓ సెంటిమెంట్ ఉంది. దాంతో అఖండ 2 తో డబుల్‌ హ్యాట్రిక్ ఖాయం అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు. సనాతన ధర్మం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సదరు సినిమాలో అఘోరాగా బాలకృష్ణను అఖండలో చూపించిన బోయపాటి అఖండ 2 లో ఇంకా ఎలా చూపిస్తాడా? అనే చర్చ సత్వత్రా నడుస్తోంది. ఆ సస్పెన్స్‌కి తెర దించుతూ అఖండ 2 ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును, మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 26న 'అఖండ 2' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సమాచారం ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమా విషయంలో ఫస్ట్‌లుక్ మొదలుకుని ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ కథకు కొనసాగింపుగానే అఖండ 2 కథ ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. లుక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బోయపాటి షూటింగ్‌ మొదలు పెట్టారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తూ ఉండగా... సంయుక్త మీనన్‌ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. బోయపాటి గత చిత్ర ఫలితం నేపథ్యంలో ఈ సినిమాపై మరింత శ్రద్ద పెట్టినట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణ ఉన్న ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: