ప్రజెంట్ ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల రీసెంట్ గానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి అన్న సంగతి కూడా అందరికీ తెలుసు . కాగా నాగచైతన్య రీసెంట్గా నటించిన "తండేల్" సినిమా సూపర్ డూపర్ హిట్  అయ్యింది. మంచి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంటుంది. హీరోయిన్ సాయి పల్లవి ని కూడా తొక్కేసే రేంజ్ లోనే నాగచైతన్య పర్ఫామెన్స్ ఉంది అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు జనాలు .


సినిమా మొదటి రోజు కూడా భారీ స్థాయిలోనే కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే ఇదే మూమెంట్లో ఇప్పటివరకు నాగచైతన్య సాధించని రేర్ ఫీట్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు అంటూ కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . ఒకవేళ అదే జరిగితే మాత్రం నాగ చైతన్య కొత్త భార్య శొభిత ధూళిపాళ్లను ఆపలేమంటూ జనాలు ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన 100 కోట్ల మార్క్ కి అందుకోలేకపోయాడు నాగ చైతన్య.



దాని కోసం ఎదురు చూస్తున్నారు. తండేల్ తో అది సాధ్యమవుతుంది అంటున్నారు జనాలు. నాగ చైతన్య అంటే జనాలకు ఇష్టం ఉన్నా కూడా శోభిత ధూళిపాళ్ల అంటే ఎందుకో వాళ్ళకి విపరీతమైన కోపం.. ఆ కారణంగానే ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన ఫస్ట్ సినిమా రిలీజ్ కావడం అది కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఈ సినిమా సగం క్రెడిట్ శోభితకే ఇచ్చేస్తున్నారు . అయితే ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి కూడా నాగచైతన్య చేరిపోతే ఇక శొభిత ధూళిపాళ్లను అస్సలు పట్టలేమని .. ఆ ఓవరాక్షన్ చూసి తట్టుకోలేమంటూ ఘాటుగ్జాటుగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ ట్రోల్లింగ్ ఎక్కువుగా జరుగుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: