![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/kaithi-29660a6b9-3a2f-487b-a9c5-f365d7d469f6-415x250.jpg)
కానీ విక్రమ్... లియో చిత్రాలతో కనగరాజ్ పెను సంచలనంగా మారిపోయాడు. వాటిని కంటిన్యూగా ఎల్సియుని మరిన్ని సినిమాలు ఉంటాయని ప్రకటించడంతో దీంతో కార్తీతో ఖైదీ-2 సినిమా ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఖైదీ సినిమా 2018లో విడుదల అయింది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో నిర్మించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న ఖైదీ-2 ను తెరకెక్కించే పనిలో లోకేష్ కనగరాజ్ ఉన్నారు. కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తారని సమాచారాలు అందుతున్నాయి. త్వరలోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలువడుతోంది. లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2022లో రిలీజ్ అయిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఖైదీ సినిమా కూడా ఉండబోతోంది. కాగా, ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ఖైదీ- 2 సినిమా ఏ మేరకు దీక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఖైదీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఖైదీ-2 సినిమా పై ప్రేక్షకుల లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.