ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను ఎంపిక చేశారు.
కాగా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ విషయాన్ని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ లో విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ను చిత్ర బృందం సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెల్లడిస్తామని అనౌన్స్ చేశారు.
పృధ్విరాజ్ సుకుమార్ ను కూడా ఈ సినిమాలో నటించనుండడం విశేషం. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా పూర్తిస్థాయి అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి ఈ సినిమా అభిమానులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.