కోలీవుడ్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం రెట్రో.. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అవ్వగా త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట. భారీ బడ్జెట్ చిత్రంగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.. 1980లో బ్యాక్ డ్రాప్లో ఒక గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన సినిమాగా ఉండబోతుందట రెట్రో సినిమా. గడిచిన కొద్ది రోజుల క్రితం టీజర్ ని కూడా రిలీజ్ చేశారు అయితే అది తమిళ భాషలోనే తీసుకురావడం జరిగింది.


ఇప్పుడు తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం రెట్రో టైటిల్ టీజర్ ని సైతం రిలీజ్ చేస్తూ తెలుగులో విడుదల చేసింది. ఇందులో గుడిమెట్ల పైన హీరో సూర్య పూజ హెగ్డే కూర్చున్నటువంటి షార్ట్ తో టైటిల్ టీజర్ ని మొదలుపెట్టేలా చేశారు.. పూజా హెగ్డే తో కోపం తగ్గించుకుంటా మా నాన్న దగ్గర పని చేయను రౌడీయిజం తగ్గిస్తా అన్ని ఈ క్షణం నుంచే మానేస్తాను అంటూ సూర్య చెప్పడంతో పూజా హెగ్డే చిన్న స్మైల్ తో చాలా ఆనందంగా ఉన్నట్టు చూపించారు. అయితే ఇందులో పూజ హెగ్డే మూగ అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే అభిమానులకు మాత్రం ఈ రెట్రో టీజర్ సరిగ్గా  కనెక్ట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సీన్లు యాక్షన్స్ సన్నివేశాలు చూపించిన లుక్స్ పరంగా సూర్య బాగానే ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే లుక్స్ పైన కూడా చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి..ఎందుకో అభిమానులకు కొంతమేరకు ఏదో లోపంగానే ఉన్నట్టు కనిపిస్తోందట. మరి ట్రైలర్ తో ఏదైనా బజ్ క్రియేట్ చేస్తారేమో చూడాలి. సూర్య గత చిత్రం కంగువా పైన కూడా తీవ్రమైన విమర్శలు వినిపించాయి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.. మరి రెట్రో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: